పర్యావరణానికి హాని కలిగించే బొక్కల కంపెనీని మూసివేయాలి

యాచారం ఫిబ్రవరి 14 (నిజం న్యూస్)
కొత్తపల్లి తక్కలపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న బొక్కల కంపెనీని వెంటనే మూసివేయాలని కొత్తపల్లి తక్కళ్ళపల్లి గ్రామాల ప్రజలకు హాని కల్గిస్తుంది అని కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కట్టెగొమ్ముల లత నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ నాగిళ్ల వెంకటయ్య తక్కల్లపల్లి సర్పంచ్ కంబాలపళ్లి సంతోష రమేష్ కొత్తపల్లి ఉప సర్పంచ్ కావలి జగన్ ఎంపీటీసీ సుమతమ్మ లోహిత్ రెడ్డి వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్ 13వ రోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు కొత్తపల్లి తక్కలపల్లి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టగొమ్ముల లతా నారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో మేము సర్పంచ్ గా ఉన్న సమయంలో ఈ కంపెనీకి అనుమతులు ఇవ్వడం జరిగింది అప్పుడు మాకు బొక్కల కంపెనీ తెలియదు అప్పుడు మాకు కోళ్ల దాన చేపల దాన తయారు చేస్తామని చెప్పడం జరిగింది అలా చెప్పడంతో మా గ్రామస్తులకు ఉపాధి కలుగుతుందని ఉద్దేశంతో అనుమతులు ఇవ్వడం జరిగింది బొక్కల కంపెనీ అని తెలిస్తే అనుమతులు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ కంపెనీ వెంటనే రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను