కాంగ్రేస్ పార్టి నుండి కౌన్సిలర్ ,ఎంపిటిసి సప్పెండ్…డిసిసి అద్యక్షులు శంకర్ నాయక్

నల్లగొండ పిబ్రవరి 14.(నిజంన్యూస్) మిర్యాలగూడ పట్టణంలోని 20 వ వార్డు కౌన్సిలర్ దేశిడి శేకర్ రెడ్డి,దిలావర్ పూర్ ఎంపిటిసి బెజ్జం సాయిలను కాంగ్రేస్ పార్టి నుండి సస్పెండ్ చేసినట్లు డిసిసి అద్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.
మిర్యాలగూడ కాంగ్రేస్ కార్యాలయంలో ఇటీవల ఘర్షణకు కారణమైన దేశిడి శేకర్ రెడ్డి,బెజ్జం సాయిలను సప్పెండ్ చేసినట్లు తెలిపారు.
దామరచర్ల మండలం దిలావర్ పూర్ ఎంపిటిసి బెజ్జం సాయి ,రార్టి కార్యక్రమాలలో ఘర్షణలు సృష్టిస్తూ పార్టి ప్రతిష్టను దెబ్బ తీస్తుండటంతో కాంగ్రేస్ పార్టి నుండి సస్పెండ్ చెసామన్నారు.
పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.