విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా

నీరు అందక ఎండిపోతున్న 300 ఏకరాల పంట
18 గంటలు విద్యుత్ ఇస్తే గాని కదలమని భీష్మించుకొని భైటయించిన రైతు
తానూర్ ప్రతినిధి ఫిబ్రవరి 11 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా తానూరు మండలము బెల్ తరోడ గ్రామములో నాందేడ్ -భైంసా రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం రభి పంటలకు 18 గంటలు విద్యుత్ ఇచ్చారు. విద్యుత్ కోతలతో పంటకి సరిపడా నీరూ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తము చేసారు. తానూర్ మండలంలోని ఝరి, ఝరి (బి), బోల్సా, మహాలింగి,బెంబర్, బెల్తరోడ,బోరేగామ్, ఎల్వీ,తానూర్ మరియు సరియద్ధు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతియ రహదారిపై దర్నాకు దిగారు. 18 గంటలు విద్యుత్ ఇస్తే గాని కదలమని భీష్మించుకొని భైటయించారు.తానూరు ఎస్.ఐ విక్రమ్ రైతులను నచ్చచెప్పాలని చూసినా 18 గంటలు ఇస్తే గాని జరుగమని కూర్చొవడంతో 2 గంటల పాటు జాతియ రహదారిపై రాకపోకలు ఆగిపోయినవి.
వాస్తవాంగా గత సంవత్సరం లాగనే విద్యుత్ సరాఫరా వుంటుందని భావించినా రైతులు తానూర్ మండల పరిధిలో రభి పంటలు 300 నుండీ 400 ఎకరాలలో పంట వేసుకున్నాడు.కాని విద్యుత్ కోతల వల్లన రైతు విసిగిపోయాడు.రాత్రి సమయాలలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదని , రాత్రిళ్లు పంట పోలాలలో గడిపిన రాత్రులు ఎన్నో వున్నాయని, విద్యుత్లేకా నీరు రాక కళ్లముందే పంట ఎండిపోతున్నాయని ఓక రైతు తన గోడు వెల్లబోసాడు.ఇకా చేసేదేమీలేక పంట పోలాలలో వుండాల్సిన రైతు రహదారిపై భైఠాయించారు.రైతే రాజు అన్నారు.కాని ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖల వైఫల్యం వల్లన రైతు విద్యుత్ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.ఇప్పటికైన ప్రభుత్వం 18 గంటలు విద్యుత్ ఇచ్చె విధాంగా అడుగులు వేయాలి.