అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి

జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 11 (నిజం న్యూస్)
జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చిన బొర్కడే హేమంత్ సహదేవ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి, వివిధ మండలాల తహసిల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ సుమారు 8 నెలలపాటు ట్రైనింగ్ కలెక్టర్ గా పని చేశానని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. త్వరలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై దృష్టి సారిస్తానని, పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో చర్యలు తీసుకుంటానని, జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, వివిధ మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.