రాజీమార్గమే రాజ మార్గం, లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి

జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి సుర సుమలత
ఆలేరు ఫిబ్రవరి 11 (నిజం న్యూస్)
క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న వారికి న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు కల్పించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలేరు జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి సుర సుమలత అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె కక్షిదారులనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో అన్ని కోర్టులలో పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు లోకదాలత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని,పరిష్కరించదగిన కేసులను ఇందులో ఇరు వర్గాల సమ్మతి మేరకు కేసును తొలగించడం జరుగుతుందని దీనికి సంబంధించి పైకోర్టులో అప్పిలుకు అవకాశముండదని అన్నారు.కక్షిదారులు ఏళ్లకేళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపనతోపాటు ఆర్థికంగా వారికి నష్టం జరగదని,కోపతాపాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్ష బూనే బదులు రాజీపడి సంతోషంగా ఒకరినొకరు పలకరించుకునే అవకాశం కలిగించడమే లోక్ అదాలత్ ఉద్దేశమని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొవాలన్నరు.జిల్లా లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో గ్రామాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.నేర రహిత సమాజ స్థాపనకు అందరూ కలిసి ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధగని శ్రీహరి,న్యాయవాదులు సీస శ్రీనివాస్,వంగరి శివకుమార్, కేవీ ప్రసాద్, హరి కృష్ణ, రావుల రవీందర్ రెడ్డి, సాయి కృష్ణ, సంతోష, రవికుమార్ గణేష్ తదితరులు ఉన్నారు.