క్రిష్ణవేణి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 11(నిజం న్యూస్)
భువనగిరి పట్టణంలోని క్రిష్ణష్ణవేణి టాలెంట్ పాఠశాలలో కరెస్పాండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క ఆరోగ్యం పై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ .కరుణ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పిల్లలకు జ్వరం, కడుపునొప్పి లాంటివి వచ్చినప్పుడు ప్రధమ చికిత్స ఎలా చేయాలి తల్లిదండ్రులకు సలహాలు ఇస్తూ, వాతావరణంలో మార్పుల ద్వారా వచ్చే వ్యాధులకు ఏ విధంగా నడుచుకోవాలని, అప్పుడప్పుడు నట్టల మందులు వాడాలని తెలిపారు..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరెస్పాండెంట్ రఘు వెంకట సురేష్ మాట్లాడుతూ పిల్లల యొక్క ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆరోగ్య పరిస్థితులైన ఏ వయసులో ఎలా ఉంటాయో వాటి తగిన విధంగా ఎలా నడుచుకోవాలని తల్లిదండ్రులకు సలహాలు సూచనలు ఇచ్చారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం .సుజాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు భిక్షమయ్య, మల్లేష్, మధుసూదన్, మంజుల, సుజాత ,కౌసర్, నీలిమ, అజ్మత్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.