Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదగిరిగుట్ట పట్టణంలో గల బస్టాండ్ ను యధావిధిగా కొనసాగించుటకై ఉద్యమిద్దాం

 

*- అఖిలపక్ష నాయకుల సమన్వయ తీర్మానం*

*- అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం..*

 

భువనగిరి ఇంఛార్జి ఫిబ్రవరి 11(నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని శనివారం రోజున సిపిఐ కార్యాలయం వద్ద పట్టణంలోని బస్టాండ్ యధావిధిగా కొనసాగించాలని, పాత హై స్కూల్ స్థలంలో భక్తుల వసతి గదులు వెయ్యి నిర్మాణం చేయాలని అంశాల పైన శనివారం రోజు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండు ఆధారంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నారన్నారు. గత పది రోజులుగా పట్టణంలోని బస్టాండ్ వద్ద సరిగ్గా బస్సులు ఆపకపోవడం వల్ల పట్టణ ప్రజలు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బస్టాండు కాలినడకన వెళ్లే భక్తులకు,మెట్ల దారిన వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉందని, వచ్చే భక్తులకు బస్టాండ్ చుట్టుపక్కల అనేక వసతి గదులు మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. గుండం వద్ద ఉన్న బస్టాండు వద్ద ఎలాంటి సదుపాయాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని. ప్రస్తుత బస్టాండ్ నుంచి పాత గుట్టకు వెళ్లడానికి భక్తులకు ప్రయాణ సౌకర్యం సులభంగా ఉందని అన్నారు. బస్టాండ్ ఇక్కడి నుంచి తరలించడం వల్ల పట్టణంలోని 90% ప్రజలు ఇబ్బందులు పడతారని వందలాది కుటుంబాలు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనాలోచితం ఇటువంటి నిర్ణయం పట్టణ ప్రజల అభివృద్ధికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికే పట్టణ ప్రజలు సరైన రోడ్ల సౌకర్యాలు లేక రోడ్డు విస్తీర్ణంలో షాపులు కోల్పోయిన వాళ్లు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయం రావడానికి పట్టణంలోని బస్టాండ్ సౌకర్యంగా ఉందని తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ యధావిధిగా కొనసాగించడానికి ప్రజలందరినీ ఐక్యం చేసి ఐక్యకారచన ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలోని తీర్మానాలు.. ఈ క్రింది విధంగా చేశారు.

* పట్టణ ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా వందలాది కుటుంబాలకు ఉపాధికి ఆధారంగా ఉన్న, బస్టాండ్ ను యధావిధిగా కొనసాగించాలి.

* పాత హైస్కూల్ స్థలంలో భక్తుల వసతి సౌకర్యం తక్షణమే వెయ్యి గదులు నిర్మాణం చేపట్టాలి.

* కొండపైకి ఆటోలను అనుమతించి ఆటో కార్మికులను ఆదుకోవాలి.

* స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

* రిటైర్డ్ అయిన ఈవో గీతారెడ్డిని విధుల నుంచి తొలగించి ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలి.

ఈ అంశాల పైన ఆందోళన చేయాలని అఖిలపక్షం తీర్మానం చేయడం జరిగింది. అనంతరం అఖిలపక్ష నాయకులు ఐక్యకరచన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సమావేశంలో దేవాలయ మాజీ ధర్మకర్త గౌలికర్ అశోక్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ కాటాబత్తిని ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మంద శంకర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బబ్బూరి శ్రీధర్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశం, దండబోయిన అనిల్, టిఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రం, గుండ్లపల్లి శ్రీరామ్, హమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ నాయకులు మిరియాల కృష్ణ, జేఏసీ నాయకులు బండి అనిల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బందారపు బిక్షపతి, బట్టు సతీష్ రాజ్, గుండ్ల నరేష్, సిపిఐ నాయకులు పేరబోయిన బంగారి, మాటూరు మల్లయ్య, బీసీ సంఘం నాయకులు బోజ్జ సాంబెష్,ఆటో యూనియన్ నాయకులు మొగులయ్య, దేవేందర్, మన్సూర్ పాషా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అభిలాష్, కంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.