క్యాంపుకు తరలిన చండూరు మున్సిపల్ కౌన్సిలర్లు…?
చండూరు,ఫిబ్రవరి 11 (నిజం న్యూస్)… చండూరు మున్సిపాలిటీ కి సంబంధించిన మొత్తం పదిమంది కౌన్సిలర్లకు గాను ఐదుగురు కౌన్సిలర్లు ఇటీవల కలెక్టర్ ను కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. కాగా ఈనెల 21 వరకు కోర్టు వాయిదా ఉంది. ఇది ఇలా ఉండగా శనివారం రోజు అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న పలువురు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈనెల 21 న వచ్చే కోర్టు తీర్పు అనుసారం తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని క్యాంపుకు తరలిన ఓ కౌన్సిలర్ తెలియజేశారు. కౌన్సిలర్ల క్యాంపు బాటతో చండూరు మున్సిపాలిటీ అవిశ్వాసం మరింత వేడెక్కింది