ఇలేగాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన రామారావు పటేల్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 10 (నిజం న్యూస్)
బైంసా మండలంలోని ఇలేగాం గ్రామంలో కీ,,శే కౌటిక్ వార్ విఠల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను బిజెపి నియోజకవర్గ నాయకులు రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతోనే ఐక్యత భావం పెంపొందుతుందన్నారు. గ్రామానికి చెందిన కృష్ణ తన తండ్రి పేరిట టోర్నమెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు ఐక్యత భావం కలుగుతుందన్నారు. ఇలేగాం గ్రామానికి చెందిన యువకులు చదువుల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాల్లో, వివిధ రంగాల్లో ఉండడం ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూర్యకాంత్ రెడ్డి. టిఆర్ఎస్ నాయకులు భీమ్రావు సోలంకి, బిజెపి నాయకులుబోజారెడ్డి,వేణు,చక్రధర్ పటేల్,ఎంపిటిసి రజాక్,స్థానిక సర్పంచ్ ముత్యం, స్థానిక నాయకులుకృష్ణమూర్తి, రత్నాకర్, ఉపసర్పంచ్ ఉత్తమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు