వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం: సింగ జోగి గిరి

గండిపేట్, ఫిబ్రవరి 11 (నిజం న్యూస్): వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిగడం ఖాయమని, ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగ జోగి గిరి అన్నారు. లంగర్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని గత తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆఫతకం, ఈ పథకం అంటూ కాలం వెల్ల తీశాడే తప్ప హామీలు మాత్రం అలాగనే ఉండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని పేర్కొన్నారు. కెసిఆర్ కు ఇక గడ్డు కాలమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.