హమారా ప్రసాద్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

బి యస్ పి మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్
తేదీ 10 మహబూబాబాద్ బ్యూరో నిజం న్యూస్
హమారా ప్రసాద్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి అని బి యస్ పి మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ ప్రభుత్వం ను డిమాండ్ చేసారు. బి యస్ పి మహబూబాబాద్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం నిర్మాత డా :అంబెడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ మొహం ను పంది శరీరం కు అమర్చిన చిత్రాలను డా :అంబెడ్కర్ విగ్రహం ముందు తగలబెట్టడం జరిగింది. ఈ సందర్బంగా ముందుగా డా :అంబెడ్కర్ విగ్రహం కు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.మరో జిల్లా ఇంచార్జ్ యల్. విజయ్ కాంత్ మాట్లాడుతూ డా :అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాతనే దేశంలో మనిషిని మనిషిగా గుర్తించి కుల, మతాలకతీతంగా,వర్ణ వర్గాలకతీతంగా, లింగ భేదగాలకతీతంగా స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో బ్రతికే హక్కు కేవలం డా :అంబెడ్కర్ పోరాటం ద్వారా వచ్చిన రాజ్యాంగం వల్లనే సాధ్యం అని అలాంటి డా అంబెడ్కర్ను అవమాణించడం అంటే అమ్మ నాన్న ను చంపుకున్నట్లే అని ఆయన అన్నారు.డా :అంబెడ్కర్ కంటే ముందే రాసిన పుస్తకాలు చదివిన తర్వాత అంబెడ్కర్ కొన్ని విషయాలు పుస్తకాల ద్వారా తెచ్చారని ఆయన అన్నారు. మరలా అంబెడ్కర్ పై విమర్శలు చేస్తే పాతరెస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దార ప్రసాద్ రావు, కోశాధికారి జింక లక్ష్మణ్, మహబూబాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు తోకల నాగరాజు, బి ఐ టి సెల్ అసెంబ్లీ కన్వీనర్ గులగట్టు హేమంత్, రవి, సురేష్, రాజా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు