గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయం

బి యస్ పి మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్
మహబూబాబాద్ బ్యూరో నిజం న్యూస్
గిరిజన జిల్లా కేంద్రం లో గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవడం అన్యాయం అని బి యస్ పి మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ అన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయం ఆనుకుని ఈ వి యం గో డౌన్ వెనుకాల గల సర్వే నెంబర్ 255/1 లో గల 30 గుంటల అసైండ్ పట్టా భూమిని 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం రెవిన్యూ అధికారులు గిరిజనులను బెదిరిస్తూ 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉండటానికి పిల్లర్లతో స్లాబ్ పోసుకున్న నిర్మాణం చేసుకోగ ఎవరు లేని సమయం లో రాత్రి వచ్చి రెవిన్యూ అధికారులు నిర్మాణం ను కూల్చివేసినట్లు గిరిజనులు రోదిస్తున్నారని ఆయన తెలిపారు. గతం ప్రీతీ మీనా కలెక్టర్ గ వున్న సమయం లో నూతన కలెక్టర్ కార్యాలయం, గో డౌన్ నిర్మాణం కోసం మా భూములే ప్రభుత్వం బలవంతంగా గుంజుకుని కొంతమందికి మాత్రమే నష్టం పరిహారం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా చేతులు దులుపుకున్నట్లు ఆయన అన్నారు. మరలా ఎలాంటి మాకు వద్దు మీ భూమి మీకే ఉంటుంది అని కలెక్టర్ ప్రీతీ మీనా నాడు హామీ ఇచ్చారని ఇప్పుడు మళ్ళీ అధికారులు భూమి కావాలి అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు.ఈ రోజు బి యస్ పి జిల్లా బృందం ఆ భూమిని పరిశీలించి ధర్నా నిర్వహించి భాధితులకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్బంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా లో గిరిజన మంత్రి, యంపి, ఎమ్మెల్యే జెడ్పి చైర్ పర్సన్ ఉండి కూడా గిరిజనులకు అనేక సమస్యలు వస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆయన వాపోయారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం గిరిజనుల భూములే గుంజుకున్న విషయం ను ఆయన గుర్తు చేసారు. కలెక్టర్ కార్యాలయం వెనుక సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమి వుంది అని అందులోనే సబ్ స్టేషన్ నిర్మాణం చేసుకోవాలని ఆయన అన్నారు. కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేయాలనీ ఆయన అన్నారు. జిల్లా కేంద్రం లో ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లు మార్చి బడా వ్యక్తులకు కట్టబెడుతున్న అధికారులు పేద ప్రజల భూములను మాత్రమే నిర్మాణాలకు కేటాయించడం సరి కాదు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో బి యస్ పి జిల్లా ఇంచార్జ్ యల్ విజయ్ కాంత్, జిల్లా కార్యదర్శి దార ప్రసాద్ రావు, జిల్లా కోశాధికారి జింక లక్ష్మణ్, మహబూబాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు తోకల నాగరాజు, బిట్సెల్ అసెంబ్లీ కన్వీనర్ గులగట్టు హేమంత్, భాధితులు పాల్గొన్నారు.