విద్యుత్ సర్క్యూట్… పూరిల్లు..దగ్ధం…15 లక్షలు ఆస్తి నష్టం

చర్ల ఫిబ్రవరి 10 (నిజం న్యూస్) మండలంలోని ఉప్పరగూడెం పంచాయతీ గన్నవరం కాలనీకి చెందిన ఇర్ఫా ప్రశాంత్ పూరిల్లు విద్యుత్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది గురువారం రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా ఒకేసారి ఇంట్లో నుండి వంటలు ఎగిసాయి. దీంతో ప్రశాంత్ ఇంట్లో సామాగ్రిని
కాపాడుకునేందుకు ప్రయత్నించగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీకై చేతులు కాలిపోయాయి ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించారు కట్టు బట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది వంట సామగ్రి తో సహా పూర్తిగా కాలి బూడిదయింది. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పత్తి. ధాన్యం అమ్ముకున్న సొమ్ము 2.50 లక్షల నగదు. బంగారం 1.20 ఇరవై వేలు. కాలిపోయాయి కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
. *అగ్ని బాధితులకు ఆర్థిక సహాయం.. మండల కేంద్రంలో ఉప్పరగూడెం పంచాయతీ గన్నవరం కాలనీకి చెందిన ఇర్ఫా ప్రశాంత్ పూరిల్లు విద్యుత్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలి ఆ కుటుంబం సర్వం కోల్పోయింది ఆ కుటుంబానికి మీకోసం మేమున్నాం .కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ ఆధ్వర్యంలో సభ్యులు రూ8 వేల విలువగల నిత్యవసర వస్తువులు వంట సామాగ్రి బట్టలు. సిపిఐ ఎంఎల్ ప్రజా పందా ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్నత అధికారులు స్పందించి ఫైర్ స్టేషన్ వెంటనేఏర్పాటు చేయాలని కోరారు అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన ఆ కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు