బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య వైద్యం పక్క గృహాలు అందిస్తాం

సంకినేని వెంకటేశ్వరరావు
పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 9
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య వైద్యం అందిస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న :రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్టంలో అధికారంలొకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం, విద్యా,పక్కాగృహాల నిర్మాణం చేపడతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు గురువారం మండల పార్టీ అధ్యక్షుడు పోకల రాములు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సత్య పంక్షన్ హాల్లో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ నెల 10 నుండి 25 వరకు అవసరమైతే మార్చి 3 తేదీవరకు గ్రామాల్లో ప్రజా గోస- బీజేపీ భరోసా పేరున ప్రతి గ్రామంలో,అవాస గ్రామాల్లో కార్నర్ సమావేశాలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న మేజర్ సమస్యలను గుర్తించడం కోసం మండలంలో 11 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను ప్రచారం చెయ్యడంలో విపలమైనదని ఎద్దేవా చేశారు సూర్యాపేట నియోజవర్గంలో ఇసుక,భూమపియా పెరిగిపొందని దింతో పాటు ధాన్యం కొనుగోలల్లో అవినీతి పెరిగిందని అన్నారు లక్షరూపాయల రుణమాఫీ , ధరణి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామాల్లో గుర్తించిన సమస్యలపై కరపత్రాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈకార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పోకల రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,జిల్లా ఉపాధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు,కట్కూరి కార్తిక్ రెడ్డి,చెన్నూ రమణా రెడ్డి,అల్స మల్సూర్,మామిడి శ్రీనివాసు, నరహరి,శ్రీనివాసు,రాపర్తి వెంకన్న,ప్రభాకర్,సతీష్,విజయ్ కుమార్,శ్రీనివాస రెడ్డి,సైదిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.