మియాపూర్ బస్టాండ్ వద్ద వ్యక్తి దారుణ హత్య

మియాపూర్ ఫిబ్రవరి 9(నిజం న్యూస్)
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కెఎస్ బేకర్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.