ఆత్మహత్య చేసుకున్న పెద్ద ముబారక్ పూర్ సర్పంచ్

సిర్గాపూర్ ఫిబ్రవరి 9 (నిజం న్యూస్ ) సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్ పూర్ సర్పంచ్ దిగంబర్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి చివరి వారంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్న పత్రాన్ని కలెక్టర్ కు సమర్పించినట్లు గత వారం క్రితం ఆయన మీడియాతో చెప్పారు. అయితే రాజీనామాను కలెక్టర్ అధికారికంగా ఆమోదించి ప్రకటన చేయలేదు. ఈయన మృతిపై సర్పంచుల ఫోరం, పలువురు సంతాపం తెలిపారు. గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.