లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

జిన్నారం ఫిబ్రవరి 8 (నిజం న్యూస్)
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్లో సాల్వెంట్ ను అన్లోడ్ చేస్తుంటే స్పార్క్ రావడంతో ఒకేసారి ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యి.. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో.. హైదరాబాద్ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.