11న మందడి స్మారక సమావేశం….

చండూరు, ఫిబ్రవరి 8 (నిజం న్యూస్) …దివంగత మండల వైస్ ఎంపీపీ, సిపిఐ సీనియర్ నేత కామ్రేడ్ మందడి నర్సింహారెడ్డి స్మారక సమావేశం, దశదినకర్మను శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు వారి స్వగ్రామం పుల్లెంల లో జరగనున్నదని సిపిఐ మండల కార్యదర్శి నడపరాజు సతీష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి , సిపిఐ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు హాజరవునున్నట్లు వెల్లడించారు