మాస్క్ కేసుల్లో జరిమానాలు

చండూరు, ఫిబ్రవరి 8 (నిజం న్యూస్)….కరోనా లాక్ డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిపైన నాడు పోలీసులు ఫోటోలు తీసి కేసులు నమోదు చేశారు. అప్పుడు అందరు తేలిగ్గా తీసుకున్నారు . కానీ పోలీస్ రికార్డుల్లో ఒకసారి కేసు నమోదు అయితే అది ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటుంది. నాడు కేసులు నమోదు అయిన వారందరి వద్ద నుంచి జరిమానాలను పోలీసులు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. కేసు నమోదు లిస్టులో ఉన్న వారందరికీ ఫోన్లు చేసి ఆధార్ కార్డు తో పాటు రూ.300 తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వందల సంఖ్యలో కేసు నమోదు అయ్యాయి