వరి పంట లో కాండం తొలుచు పురుగు కు తీసుకోవలసిన జాగ్రత్తలు

డి రామారావు నాయక్
పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 8 నిజం న్యూస్
మండల పరిధిలోని పొట్లపహాడ్ గ్రామంలో బుధవారం
జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావ్ నాయక్ వరి పంట పొలాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంట లో కాండం తొలుచు పురుగు ఆశిస్తున్నది అని తెలిపారు.నివారణ కు కార్టాఫ్ హైడ్రో క్లోరి్ 2 గ్రా లేదా క్లోరంట్రిప్రోలే 0.3 మిల్లీ లీటర్లు నీటి లో కలిపి పిచికారి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ , వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోస్న,రైతులు రామినేని కృష్ణయ్య ,ఎల్లమ్మ వెంకన్న నారాయణ పీతాంబర రెడ్డి,నారాయణ జగన్ రెడ్డి,గొబ్బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.