నల్ల తామర పురుగు ఆశించిన మిరప తోటలను పరిశీలిస్తున్న కెవికె శాస్త్రవేత్తల బృందం

పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 8 నిజం న్యూస్
మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో నల్ల తామర పురుగు ఆశించిన మిరప తోటలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సందర్శించినారు ప్రస్తుతం మిరప పంటలలో ఆశించిన నల్ల తామర పురుగు మరియు నల్లి నివారణకై రైతులందరూ సామూహికంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వలన ఈ పురుగు నుండి నివారించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి ఇన్చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ బి లవ కుమార్ తెలిపారు. సమగ్ర యాజమాన్య పద్ధతులలో భాగంగా రైతులు పొలంలో ఎకరానికి 50-100 చొప్పున నీలిరంగు మరియు తెలుపురంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. వేపనూనె 5 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తల్లిపురుగులు గ్రుడ్లు పెట్టకుండా వేపనూనె నివారిస్తుంది. జీవనియంత్రణ శిలీంధ్రాలైన బవేరియా బాసియానా మరియు వర్టిసీలియమ్ లెకాని 5 మి.లీ. లీటరు నీటిలో వేప నూనెతో కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా పురుగు ఉదృతిని కొంత వరకు తగ్గించుకోవచ్చు. తదుపరి అవసరమైతే రసాయన పురుగు మందులు అయిన ఎక్స్‌పోనస్ (బ్రోఫ్లానిలైడ్) 300 జి యల్ ఎస్ సి 30 మి.లీ/ఎకరానికి లేదా గ్రేసియా (ఫ్లుక్సామెటమైడ్) 10% డబ్ల్యూ బై డబ్ల్యూ ఈ సి 160 మి.లీ/ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 డబ్బు జి 40/ గ్రా. (0.2 గ్రా. లీటరు నీటికి) లేదా సయాంట్రానిలిప్రోల్ 240 మి.లీ/ఎకరానికి (1.2 మి.లీ/ లీటరు నీటికి) లేదా 40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% డబ్ల్యు.జి 40 గ్రా. ఎకరానికి (0.2 గ్రా. లీటరు నీటికి) మరియు నల్లి నివరణకై స్పైరోమెసెఫెన్ 1 మి.లీ. లేదా డైఫెన్తయురాన్ 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో కె.వి.కె ఉద్యాన శాస్త్రవేత్త