గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 8 నిజం న్యూస్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 12న జనగాం జిల్లా పాలకుర్తిలో ప్రారంభమయ్యే పాదయాత్రను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ .ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీనివాసు. పిలుపునిచ్చారు బుధవారం అన్నారం గ్రామంలో పాదయాత్రకు సంబంధించిన డోర్ పోస్టర్లను విడుదల చేస్తూ వారు మాట్లాడారు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ వల్ల గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తింపకుండా కుట్ర పన్నింది ఎంతో కాలం నుండి కనీస వేతనం 26000 రూపాయలుగా నిర్ణయించాలని కార్మిక సంఘాలు పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజుకు 178 రూపాయలు మాత్రమే నెలకు 4628 రూపాయలు సౌకర్యం మాత్రమే కనీస వేతనం నిర్ణయించింది నాలుగు లేబర్ కోడ్ తో పిఎఫ్ ఈఎస్ఐ ఇతర కార్మిక చట్టాలు సంక్షేమానికి నోచుకోన దృష్టితి కార్మికులు ఆ మడ దూరం నెట్టివేయబడ్డారు గ్రామపంచాయతీ సిబ్బంది లో అత్యధికులు దళిత .గిరిజన. బలహీన .వర్గాలకు .చెందిన పేదలు పాలకులు మారిన వీరి బ్రతుకులు మాత్రం మారడం లేదు 76 ఏళ్ల స్వతంత్రంలో నిర్లక్ష్యం నిరా ద రణకు గురైన వారు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులే గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం నిర్ణయించాల లి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రణపంగవెంకన్న. నకరికంటి నరసయ్య. గరిన నాగరాజు .కొండేటి సైదులు .సత్యం. సుధాకర్. తదితరులు పాల్గొన్నారు