నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం – మందకృష్ణ మాదిగ

సూర్యాపేట టౌన్ ఫిబ్రవరి 8 (నిజం న్యూస్)
స్థానిక పబ్లిక్ క్లబ్ లో మహాజన సోషలిస్ట్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మానవతా ఉద్యమాల స్ఫూర్తిదాత మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ మాదిగ, మాదిగ ఉపకులాలను మోసం చేస్తున్నారని అన్నారు. గతంలో బిజెపి పెద్దలు బండారి దత్తాత్రేయ సమక్షంలో అనేకమంది బిజెపి పెద్దలు దండోరా బహిరంగ సభలకు హాజరై ఎంఆర్ పిఎస్ చేసే పోరాటం సామాజిక న్యాయమైనదని, బిజెపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని అనేకమార్లు హామీలు ఇచ్చారని, ఇప్పటికి 9 సంవత్సరాలు గడుస్తున్న పార్లమెంటులో బిల్లు పెట్టకుండా జాప్యం చేస్తూ మాదిగ ,మాదిగ ఉపకులాలని మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా పిబ్రవరి నెల 13న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని, జరగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ సమావేశంలోఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ ఎంఎస్పి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న. ఎమ్మెస్పీ జాతీయ నాయకులు మందకుమార్ , బొజ్జ సైదులు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ములకలపల్లి రవి ,ఎనుముల నర్సయ్య ఏపూరి రాజు మాదిగ పుట్టల మల్లేష్ మాదిగ డప్పు మల్లయ్య దైద వెంకన్న కనుకుట్ల వెంకన్న దాసరి వెంకన్న చెరుకుపల్లి చంద్రశేఖర్ మేడి కృష్ణ , బొజ్జ వెంకన్న,చెరుకుపల్లి కిరణ్ వెంకట రాములు,చిన్ని తదితరులు పాల్గొన్నారు