యాదవ్ హక్కుల పోరాట సమితి నాయకులను నిర్బంధించి అరెస్టు చేయటాన్ని ఖండిస్తున్నాం

రాష్ట్రవ్యాప్తంగా యాదవ్ హక్కుల పోరాట సమితి నాయకులను నిర్బంధించి అరెస్టు చేయటాన్ని ఖండిస్తున్నాం
పొల్లా నర్సింహరావు యాదవ్, యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
సూర్యాపేట టౌన్ ఫిబ్రవరి 8 (నిజం న్యూస్)
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు పొల్లా నర్సింహరావు యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులకు కార్పొరేషన్ కావాలని 33 జిల్లాలలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం దృష్టికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసి విజ్ఞప్తులు చేసినా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా గొర్రెల పెంపక సహకార సంఘాల ద్వారా 7500 కోట్లు సేకరించి 3,500 కోట్లకు మాత్రమే విడుదల చేసి 4000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచుకోవడం ఎంతవరకు సబమని ప్రశ్నిస్తున్నాం పెంపకం దాని సంఘాల కాపర్లకు భీమా లేదు పెన్షన్లు లేవు భద్రత లేదు గొర్రెలు మేపడానికి ఇస్తానన్న బంజరాయి భూముల ఊసే లేదు ప్రభుత్వం యాదవుల్ని కక్ష సాధింపు చర్య వహిస్తా ఉంది. యూనిట్లు వస్తాయని ఆశతో ఎదురుచూస్తు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది కొన్ని వృత్తి సంఘాల వారికి కార్పొరేషన్లు రాయితీలు హామీలు కల్పించి కేవలం యాదవుల్ని వారి సంక్షేమాన్ని విస్మరించి వేదనకు గురిచేస్తున్నారన్నారు, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో యాదవ్ సామాజిక వర్గం అంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాము అన్నారు, యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ట్ర నాయకులను అరెస్టులు దిగ్బంధాలు చేయడం అప్రజాస్వామికం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విధానాలకు తిలోదకాలు ఇచ్చి తీరు మార్చుకొవాలని యాదవుల సంక్షేమానికి తోడ్పాటు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు మర్ల శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర యాదవ్ కుల యువజన ఉపాధ్యక్షులు ఎల్లవుల రాము యాదవ్ .జిల్లా యాదవ్ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి పార్తనబోయిన విజయ్ కుమార్ యాదవ్ .జెట్టి వెంకన్న యాదవ్, బర్రి శ్రీను యాదవ్, గంట సైదులు యాదవ్, అలిశేట్టి శ్రీను యాదవ్, బెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.