సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఎస్ఐ నారాయణ

సిర్గాపూర్ ఫిబ్రవరి 08(నిజం న్యూస్):సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్ఐ నారాయణ బుధవారం ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలకు ఆన్లైన్,సైబర్ మోసలా పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. మొన్న మన పక్క మండలమైన నాగల్గిద్దా మండలంలోని మోసానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి
ఈ క్రమంలో రిజిస్టర్ చేయించి మొదట వెయ్యి రూపాయలు పెడితే 1300 ఇవ్వడం,పదివేల రూపాయలు పెడితే 14000 ఇవ్వడం ప్రారంభించాడు.ఈ మోసాన్ని గ్రహించని ప్రభుత్వ ఉద్యోగి విడతలవారీగా డబ్బులు వేసుకుంటూ పోయాడు. ఈ క్రమంలో మొత్తం 19,56,196 లను నెట్ బ్యాంకింగ్,ఫోన్ పే ద్వారా డబ్బులు వేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో అరవింద్ కృష్ణ అని అడగగా ప్రాసెసింగ్ ఫీజు తిరిగి ఏడు లక్షలు కడితే డబ్బులు ఇస్తామని అనడంతో తాను మోసపోయానని గ్రహించి నాగలిగిద్ద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసిన విషయమే.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఎక్కువమంది సైబర్ మోసానికి బలవుతున్నారని ఎస్ఐ నారాయణ అన్నారు. ఆన్లైన్లో డబ్బులు ఆశ చూపుతూ వస్తున్న ఎలాంటి లింకులను నమ్మరాదని ఓటీపీలు ఇతర
సమాచారం ఇవ్వరాదని సూచించారు.కానీ ఏవరైనా ఓటీపీ, ఆన్లైన్లో వచ్చినటువంటి లింకులకు ఓపెన్ చెయ్యకూడదు. ఒక వేళ మీరు ఓపెన్ చేసినట్లైతే మీ ఖాతాలోని డబ్బులు కాజెస్తారు.మీరు ఇబ్బందులకు గురైతారు కావున ఎలాంటి లింకులను ఓపెన్ చెయ్యకండి. అపరచిత వెక్తులకు ఓటీపీ, బ్యాంక్ ఖాతా నంబర్ చెప్పకూడదు. ఒక వేళ మీకు అనుమానించాదగ్గ వారు అనుపిస్తే పోలీసులకు తెలుపండి. మీకు సలహాలు,జాగ్రత్త పరుస్తారు,తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నారాయణ అన్నారు.