2023 సంత్సరానికి గాను విద్యార్థిని కొత్త జోష్నకు ఉత్తమ అవార్డు

ప్రెసిడెన్సీ స్కూల్ చైర్ పర్సన్ తీగల జయలక్ష్మి..
భువనగిరి ఇంఛార్జి ఫిబ్రవరి 07(నిజం న్యూస్)
పట్టణ కేంద్రంలోని ప్రెసిడెన్సీ స్కూల్ భువనగిరి యానివర్సరీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి, కూతురు కొత్త జోష్న, 2023 సంత్సరానికి గాను ఉత్తమ విద్యార్థిని గా భువనగిరి రూరల్ సీఐ సత్యనారాయణ, దిడ్డి బాలాజీ, కౌన్సిలర్ పంగి రెక్కల స్వామి, చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విద్యార్థిని ఒక చదువే కాదు ఆటలు, పాటలు, డాన్స్ లాంటి అన్ని రంగాల్లో ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్ పర్సన్ తీగల జయలక్ష్మి, రూరల్ సీఐ సత్యనారాయణ, స్కూల్ మాజీ చైర్మన్ దిడ్డి బాలాజీ, కౌన్సిలర్ పంగి రెక్కల స్వామి, పాల్గొన్నారు.