Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పర్యావరణ ప్రేమికురాలు….. శ్రీజ

కుండీ తయారీకి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…..

పర్యావరణాన్ని రక్షించుటకు పదవ తరగతి చదువుతున్న… శ్రీజ ఎంచుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం….

హైదరాబాద్ ఫిబ్రవరి 7 నిజం న్యూస్

మనం ఎంకరేజ్ చేయాల్సింది
సెలబ్రిటీ లని చేయాల్సింది
డుగ్గు డుగ్గు బండి పాట కి
డాన్స్ చేసే అమ్మాయి ల ని కాదు
ఇలాంటి కొత్త కొత్త విషయాలని కనుకున్న చిట్టి తల్లులని

ఈ కుండీ.. పర్యావరణ
హితమండీ!

చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు ఎ.శ్రీజ… పక్కనున్న కుండీలు.. పర్యావరణహితంగా ఆమె రూపుదిద్దినవే.. వేరుశనగ పొట్టు, ఇతర సహజసిద్ధ పదార్థాలను ఇందుకామె వినియోగిస్తోంది. నర్సరీల్లో మొక్కలను పెంచేందుకు నల్లటి పాలిథీన్‌ కవర్లను వాడుతుంటారు. అవి ఏళ్ల తరబడి మట్టిలోనే ఉండిపోతాయి. పర్యావరణానికి హాని చేస్తాయి. దానికి పూర్తి భిన్నమైనవి శ్రీజ తయారుచేస్తున్న కుండీలు. వాటిలో మట్టిని నింపి మొక్కలుంచి పాతితే సరి. కుండీలు సులువుగా మట్టిలో కలిసిపోతాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. పర్యావరణహిత కుండీల తయారీపరంగాఆమెఆలోచనకుప్రధానోపాధ్యాయుడు అగస్టీన్‌, ఇతర ఉపాధ్యాయులు సహకరించారు. శ్రీజ సృజన గతేడాది సెప్టెంబరులో సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికై, జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అదే ఏడాది టీఎస్‌ఐసీ రూరల్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శ్రీజ యోచనకు మెచ్చిన టీ-వర్క్స్‌ ఆ కుండీల తయారీకి ఊతమిస్తూ ‘బయోప్రెస్‌ 4 టీ’ యంత్రాన్ని అందజేసింది. తన ప్రతిభ నేపథ్యంగా ఇటీవల హైదరాబాద్‌ టీహబ్‌లో ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంసలందుకుంది.

ఏది ఏమైనా శ్రీజకు మేధస్సుకు…. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించి…. ప్రత్యేక నిధులు కేటాయిస్తే… పర్యావరణానికి మేలు చేసే అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు… ఆమె కు ప్రజలంతా హాట్సాఫ్ చెప్పాల్సింది సుమ….