ఆర్ సి ఓ పై చర్యలు తీసుకోవాలి

మంద శశి కుమార్
మహబూబాబాద్ బ్యూరో , నిజం న్యూస్
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల&కళాశాల ఆర్ సి ఓ (ఖమ్మం పాయింట్ )2022 -23 విద్యా సంవత్సరంలో నూతనంగా రాష్ట్రవంతట 81 జూనియర్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ సంబంధిత రాష్ట్ర శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానిలో మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ బాలికల నరసింహుల పేట గురుకుల పాఠశాల&కళాశాల ను అప్గ్రేడ్ చేశారు అట్టి సోషల్ వెల్ఫేర్ లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే సంబంధిత లోకల్ జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర కమిషనర్ ఉత్తరువులు జారీ చేయడం జరిగింది కానీ సంబంధిత రాష్ట్ర కమిషనర్ ఉత్తరువులను పట్టించుకోకుండా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అనుమతి తీసుకోకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇట్టి విషయంపై 17- 10- 2022 మరియు 21 -11- 2022 రోజుల్లో ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్సిఓ పై విచారణ జరపాలి.
అదేవిధంగా మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ బాలికల్లో కూడా పిటి గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఎలాంటి పత్రిక ప్రకటన ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన వాళ్లకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్సిఓపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఈరోజు ఎంక్వయిరీ చేసిన ఫైల్ ను సమర్పించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.