మిర్యాలగూడలో కొట్లాడుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

డిసిసి అద్యక్షుడు శంకర్ నాయక్ వర్సెస్ బిఎల్ఆర్ వర్గాల తన్నులాట*
మిర్యాలగూడ పిబ్రవరి 6(నిజంన్యూస్)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమన్నది. డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ వర్గీయుల మధ్య బాహాభాహీ చోటు చేసుకోవడంతో పాటు గల్లాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు….
మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎల్ఐసి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు వెళ్లాల్సి ఉంది. కాగా పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను తమకు తెలియజేయడం లేదంటూ బిఎల్ఆర్ వర్గీయులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ను నిలదీశారు.
ఈ క్రమంలో శంకర్ నాయక్ వర్గీయులు బిఎల్ఆర్ వర్గీయులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తత కు దారితీసి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. గల్లాలు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఇదిలా ఉండ గా ఇరువర్గాలకు చెందిన వారు మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ పేర్కొన్నారు.