అంగరంగ వైభవంగా శ్రీగోదాదేవి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం

*-ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు రథోత్సవం కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు*
యాచారం ఫిబ్రవరి 5 (నిజం న్యూస్)
ఈరోజు యాచారం మండల పరిధిలోని తక్కలపల్లి కొత్తపల్లి గ్రామాలకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రథోత్సవం కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆలయ కమిటీ ఆహ్వానం వరకు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చల్లని దీవెనలు నియోజకవర్గం లోని ప్రజలందరి మీద ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మస్కునర్సింహ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు పొలముని రామకృష్ణ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి గౌడ్ కట్టెగొమ్ముల నారాయణరెడ్డి కందూరి సాయిరాం కోరే జగదీష్ రావు కొండల్ ఎండి రన్ని కావలి బాలయ్య నాగిళ్ల వెంకటయ్య నరేందర్ రెడ్డి గుడ్ల రమేష్ సత్తయ్య చాట్ల వెంకటయ్య యాదిరెడ్డి కొండాపురం నరసింహ గుడ్ల రమేష్ చిక్కుడు జంగయ్య మరియు భక్తులు పాల్గొనడం జరిగింది