కొత్తపల్లి గ్రామంలో బొక్కల కంపెనీని వెంటనే మూసివేయాలి

*-నాలుగవ రోజు కొనసాగుతున్న నిరాహార దీక్ష*
*-నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన టిపిసిసి ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి*
*-బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్*
యాచారం ఫిబ్రవరి 5 (నిజం న్యూస్)
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో నెలకొన్న బొక్కల కంపెనీ మూసివేయాలని నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరి విజయవంతంగా కొనసాగడంతో ఆ దీక్షకు సంఘీభావం తెలిపిన మల్రెడ్డి రంగారెడ్డి ఆయన మాట్లాడుతూ కిసాన్ ఆగ్రో ఫీడ్స్ అనే పేరుమీద నిర్మించిన కంపెనీ జంతువుల కళేబరాలతో ఎముకలతో నూనె తయారు చేయడం ఎముకలతో పౌడర్ తయారు చేయడం జరుగుతుంది ఈ కంపెనీ నడుస్తున్న సమయంలో విషవాయువులు వెదజల్లే దుర్వాసన రావడం జరుగుతుంది దానివల్ల గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనేక వాంతులు విరోచనాలు చర్మవ్యాధులు వంటివి వ్యాప్తి చెంది ఆసుపత్రి పాలు జరగడం జరుగుతుంది కావున ఈ దుర్వాసన వెదజల్లే కంపెనీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కంపెనీ వద్దని దానికి సంబంధించిన పర్మిషన్లు వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు రద్దు చేయాలని రద్దు చేసేంతవరకు ఈ నిరాహార దీక్ష ఉద్యమాన్ని నీరుగార్చకుండా ఉద్యమం చేయాలని మీకు అన్ని విధాలుగా సహకరిస్తారని మల్ రెడ్డి రంగారెడ్డి గారు వెంటనే పొల్యూషన్ బోర్డ్ అధికారులతో మాట్లాడడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినట్లు తేలియజేశారు తర్వాత ఈ కార్యక్రమానికి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ గారు నిరాహార దీక్ష కేంద్రానికి హాజరై సంఘీభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావలి జగన్ వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ కాలే రమేష్ ఎంపీటీసీ సుమతమ్మ లోహిత్ రెడ్డి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు గుండాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మస్కు నరసింహ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి ఎండి రన్ని కావలి బాలయ్య బండ ఐలయ్య కాస కృష్ణయ్య కాలే చిన్న రమేష్ తలారి సత్యనారాయణ కాస నరసింహ కంబాలపల్లి జంగయ్య బొల్లంపల్లి వెంకటయ్య కాలె కుమార్ పోలే మహేష్ కంబాలపల్లి గిరి రవీందర్ రెడ్డి కొండాపురం నరసింహ తలారి పోచయ్య గుడ్ల జంగయ్య మాలే నారాయణరెడ్డి గుడ్ల సంజీవ వంగ సంజీవరెడ్డి చాట్ల శ్రీకాంత్ పోలే వంశీ కాలే లింగం కంబాలపల్లి శివశంకర్ కొండాపురం యాదయ్య తలారి యాదగిరి చందర్ నాయక్ తలారి యాదయ్య మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు యువకులు పాల్గొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపడం జరిగింది బొక్కల కంపెనీ బందు అయ్యేవరకు నిరాహార దీక్ష విరమించేది లేదని తెలపడం జరిగింది