Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలే

 

-బిజెపి బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయండి.

-ఆలూరు, తల్లారం గ్రామాలలో భాజపా జెండా ఆవిష్కరణ.

-పాల్గొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

-బీజేపీలో చేరిన వివిధ పార్టీల నాయకులు.

చేవెళ్ల, ఫిబ్రవరి 05(నిజం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. చేవెళ్ల మండలంలోని తల్లారం, ఆలూరు గ్రామాల్లో ఆదివారం భాజపా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, బిఅర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు,యువకులు బిజెపి మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ…. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు,నిధులు నియామకాల్లో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలంతా ఏకమై ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మరెవరికి లాభం చేకూరలేదన్నారు. స్వలాభం కోసం తప్పితే ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేయడం లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరు చెప్పి వేలకోట్ల రూపాయలు వెనకేసుకున్నారని వాటిని కాపాడుకోవడం కోసమే బిఆర్ఎస్ గా పార్టీ పేరు పెట్టారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,కెసిఆర్ నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు కంచర్ల ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు అత్తిలి అనంతరెడ్డి, మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రెడ్డి, చేవెళ్ల బీజేవైఎం అసెంబ్లీ అధ్యక్షుడు అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షుడు అశోక్, ఓబీసీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, టౌన్ బీజేవైఎం ప్రెసిడెంట్ బండారి శేఖర్ రెడ్డి, బిజెపి టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, తల్లారం, ఆలూరు గ్రామాల బూత్ అధ్యక్షులు కుమార్ గౌడ్, కృష్ణ… ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.