కలగానే మిగిలిన కస్తూర్బా గాంధీ సొంత భవన విద్యాలయం

-ఎమ్మెల్యే మరియు అధికారుల మాటలను పెడచెవిన పెట్టిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ శ్రీనివాస్
-విద్యార్థుల ఆశలను నీరు కార్చిన కాంట్రాక్టర్
-చోద్యం చూస్తున్న అధికారులు
-ఎమ్మెల్యే హామీతో సంతోషం వ్యక్తం చేసిన ఇప్పటివరకు నెరవేరని సొంత భావన కలల
– విద్యార్థుల నెలకొన్న నిరుత్సాహం
-తమ ఘోషలు ఎవరికి పట్టవని విద్యార్థుల హృదయ వేదన
-ఇరుకు గదులు చాలీచాలని మూత్రశాలలో చాలా ఇబ్బందులు.
కడ్తాల్ ఫిబ్రవరి 3 (నిజాం న్యూస్)
నూతనంగా ఏర్పడిన కర్తాల్ మండలంలో బాలికలకు విద్యనుగుణంగా కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేయగా చుట్టుపక్క గ్రామపంచాయతీలలోని ఉన్న విద్యార్థినిలు హాస్టల్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు కొరకు హాస్టల్లో సీటు సంపాదించాలనో విద్యార్థినిలోనూ ప్రభుత్వ భవనం లేనందున మొదట విద్యార్థినిల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల అద్దె భవనంలో హాస్టలను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం దాదాపు 200 మందికి పైగా విద్యార్థినిలు సంఖ్య చేరుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న విషయం ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు గానుగుమారల తండా సమీపంలో గల ప్రభుత్వ స్థలాలలో భవన నిర్మాణానికి ఏర్పాటు చేశారు అయితే భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శ్రీనివాస్ టెండర్ అప్పగించారు శ్రీనివాస్ కాంట్రాక్ట్ పొంది దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలలు అవుతున్న ఇప్పటివరకు భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు ఇది ఇలా ఉండగా 11 నవంబర్ 9 2022 రోజున రేఖ్య తండాలలో పలు అభివృద్ధి పనుల నిమిత్త విచ్చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కస్తూర్బా భవన నిర్మాణ పనులు గురించి అధికారులను ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పకపోవడం లో స్వయంగా ఎమ్మెల్యే భవన నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లారు అక్కడ పనులు నత్తనడకన సాగడం చూసి అక్కడనుండి కాంట్రాక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఎందుకు భవన నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించి జనవరి 20 2023 రోజు వరకు భవన నిర్మాణ పనులు పూర్తిచేసి జనవరి 26 2023 రోజున ప్రారంభానికి భవనం పూర్తి చేయాలని ఆదేశించారు ఇది ఇలా ఉండగా డిసెంబర్ 1 2022 రోజున కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినిలకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విద్యార్ధినిలకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిలకు ఇబ్బందులు లేకుండా సొంత భవనం పూర్తి చేసి జనవరి 26 2023 రోజున అందుకు సొంత భవనంలో ఉంటారని తెలియజేశారు ఆ మాట వినగానే విద్యార్థినులలో చాలా సంతోషం వెలివేరిసింది వారి కళ ఇప్పటికీ నెరవేరక పోవడంలో విద్యార్థినీలలో అటు అధికారులపై ఇటు రాజకీయ నాయకుల పైన వారు చెప్పే మాటల పైన విశ్వాసం లేకుండా పోయిందని తమ సొంత భవనం కల ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై స్పందించి వీలైనంత త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు