నెమలిని పోలీసులకు అప్పగించిన అమ్మాపురం రైతులు

మహబూబాబాద్ తొర్రూర్ ఫిబ్రవరి 05(నిజం న్యూస్)
తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఆదివారం ఉదయం రైతులు పొలాల వద్దకు వెళ్లిన క్రమంలో కుక్కలు జాతీయ పక్షి నెమలి వెంట పడడంతో అమ్మాపురం రైతులు ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య, పాక ఎల్లేష్, బొమ్మెర భాషలు నెమలిని కాపాడి, స్వయంగా తొర్రూరు పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్ సమక్షంలో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఎస్సై రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తారచాంద్, పోలీస్ సిబ్బంది పరమేష్ తదితరులు పాల్గొన్నారు