జారిపడిందా లేక ఆత్మహత్యనా..?

సిర్గాపూర్ ఫిబ్రవరి 5
(నిజం న్యూస్ ) సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఎస్టీ గురుకులం ఇంటర్ ఫస్ట్ఇయర్ విద్యార్థిని లక్ష్మి శుక్రవారం రోజు రెండో అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలై ఆపస్మారక స్థితిలో వెళ్లిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థి ఆదివారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు సిర్గాపూర్ ఎస్సై నారాయణ తెలిపారు.
విద్యార్థి కాలుజారి పడిపోయిందా
లేక వేరే ఏదైనా సమస్య ఉండి ఆత్మహత్యకు పాల్పడిందా అన్న అనుమానాలు లేకపోలేదు. కొంతమంది పాఠశాల విద్యార్థిలను అడిగితే ఏదో లెటర్ కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందాని అంటున్నారు, ఏది ఏమైనా విచారణలో పాలు జారి కింద పడిపోయిందా మరి ఏదైనా కారణం ఉందా అని తెలిసే అవకాశం ఉంది. ఇంకా పూర్తి విషయం తెలియాల్సివుంది