శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.గాదరి

శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నఎమ్మెల్యే డా.గాదరీ. కమల కిశోర్ కుమార్, జెడ్పిచైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు దంపతులు
అర్వపల్లి ఫిబ్రవరి 5 నిజం న్యూస్
జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో *శ్రీశ్రీశ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు, జెడ్పిచైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు దంపతులు శ్రీ యోగనంద లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవానికి హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు,తలంబ్రాలు సమర్పించి నియోజక వర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దావుల వీర ప్రసాద్ యాదవ్, ఆలయ అధికారులు, ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…