గురుకుల కళాశాలలో రెండవ అంతస్తు నుంచి కింద పడ్డ విద్యార్థిని… తీవ్ర గాయాలు..?

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలలో రెండవ అంతస్తు నుంచి విద్యార్థిని కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.కింద పడ్డ విద్యార్థిని హుటా హుటిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోహిర్ మండలం పీచేరాగడి తాండకు చెందిన లక్ష్మి బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది శుక్రవారం సాయంత్రం విద్యార్థుల రూల్ కాల్ కు హాజరై తిరిగి రూమ్ కి వెళ్తుండగా రెండవ అంతస్తు నుంచి పడింది, తలకు గాయం కావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందా…?లేక ప్రమాద వశాత్తు జారిపడిందా…? అనే విషయం తెలియాల్సి ఉంది. కళాశాలకు చేరుకొని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ లేరంటూ కళాశాల సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని. తాము మిగతా విద్యార్థులతో రూల్ కాల్ కాగానే అక్కడే ఉన్నామని ప్రమాదం ఎలా జరిగిందనేది తమకు కూడా తెలియదని కళాశాల ప్రిన్సిపల్ శ్యామల దేవి చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించి నారాయణఖేడ్ నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి, మెరుగైన వైద్యం కొరకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.