జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య….. టి డబ్ల్యూ జె ఎఫ్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 04 (నిజం న్యూస్)
సమాజానికి మూలస్తంభాల్లో ఒకటైన పత్రికా మీడియా జర్నలిస్టుల పై దాడులు చేయడం హేయమైన చర్య అని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద అన్నారు..శనివారం భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీసీపీ రాజేష్ చంద్ర కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వివేకా మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఈ మధ్య కాలంలో దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు..సమాజ హితం కోరే జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు కొందరి అసమర్ధతను అద్దం పడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరం అన్నారు.మోత్కూరు మున్సిపల్ చైర్మన్ భర్త తన అనుచరులతో నవ తెలంగాణ విలేకరి ఇంటిపై,కుటుంబ సభ్యులపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు. తక్షణమే ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పేరబోయిన నర్సింహులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.అధికార పార్టీకి చెందిన నేతలు విలేకరులపై దాడులకు పాల్పడటం వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలకడం జరుగుతున్నదని విమర్శించారు.మోత్కూరు లో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా ఉద్యమిస్తాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్ సీనియర్ జర్నలిస్టులు ఎస్ కే ఉస్మాన్ షరీఫ్,కోడారి వెంకటేష్ ఎల్లంల వెంకటేష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు నిమ్మల సురేష్ గౌడ్ ఎండీ ఇస్థియాక్ పూజ నర్సింహ పాల రాజు తదితరులు పాల్గొన్నారు.