Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కూతురు మాయ మాటలు… మర్మం తెలియని తండ్రి

ఖమ్మం.. జిల్లా…
ఖమ్మం బ్యూరో ఫిబ్రవరి 4( నిజం న్యూస్)
బిడ్డలు పెద్దయి వారు వివిధ రంగాల్లో స్థిరపడిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మాత్రం పట్టించుకోకపోవడం కాకుండా వారి వెనకాల ఉన్న ఆస్తులు పాస్తులు కోసమై కల్లబొలి ప్రేమను చూపెడుతూ లేని మమకారం వలకబోస్తూ ఆస్తి మొత్తాన్ని తమ చేజిక్కిన తర్వాత పసిప్రాయం వలె ఉన్న వృద్ధ తల్లిదండ్రులను తమ బిడ్డలు రోడ్డున పడేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం…

ఇలాంటి సంఘటన ఖమ్మం జిల్లాలో తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది…

వివరాల్లోకెళ్తే చాగంటి రామయ్య దంపతులకు పుట్టిన గారాల పట్టి రేణుక, తన బిడ్డ భవిషత్తుకై అహర్నిశలు కష్ట పడి పైసా, పైసా కూడపెట్టి వయసు వచ్చాక ఒక అయ్యా చేతిలో పెట్టి ఘనంగా పెళ్ళి జరిపించాడు, వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటదనుకున్న బిడ్డ విషంతో ఉంటదని పసిగట్టలేకపోయిన తండ్రి..
విధి ఆడిన వింత నాటకం లో రామయ్య భార్య అనారోగ్యంతో ని పది సంవత్సరం ల క్రితం కోల్పోయాడు,
అదే సమయంలో తన తండ్రి ఆస్తి పై కన్నేసిన కూతురు తండ్రి పట్ల ఉన్నతమైన ప్రేమను కనబడుతున్నట్టు నటిస్తూ పల్లెటూరు వద్దు హైదరాబాదులో ఏదైనా వ్యాపారం పెడదాం నువ్వు కూడా మాతో ఉండొచ్చు అందరం కలిసే ఉందాం అని అంటూ మాయ మాటలతో ఆ మాటలు వెనకాల ఉన్న మర్మం తెలియని తండ్రి సరేనంటూ కొన్ని రోజులు హైదరాబాదులో కాలం గడిపారు..

తర్వాత ఆ కూతురు మనసులో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి పై ప్రేమను కొద్దికొద్దిగా వ్యక్తపరుస్తూ చివరకు తండ్రికి మాయమాటలు చెప్పి రెండు ఎకరాల భూమి ఊరిలో నివాసం ఉన్న ఇంటి స్థలం సైతం సుమారు కోటి రూపాయలు పైగా ఉన్నటువంటి స్థిరాస్తి ని అప్పనంగా కొట్టేసినటువంటి ఘనత ఆ కూతురికి చెల్లుబాటు అయింది..
కొన్నాళ్లు కు ఆస్తి మొత్తం తన పేరున రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తండ్రితో చిన్నచిన్న విషయాలకు వాగ్వాదం చేస్తూ ప్రైవేటు ఓల్డ్ ఏజ్ హోమ్ బాగుంటుందని అక్కడైతే చాలామంది నీలాంటి వయసు వాళ్ళు ఉంటారని అంత సంతోషంగా ఉంటారని మేము కూడా సమయం దొరికినప్పుడల్లా వస్తామంటూ ఆ తండ్రి
నమ్మించినదీ ప్రతివారం ,నెలకోసారి వస్తాం నాన్న అంటూ నమ్మించే మాటలతోటి తన తండ్రిని వృద్ధాశ్రమకు తరలించేలా పథకం రసించుకున్నారు…

తరువాత కొద్దీ రోజులైనా తరువాత తండ్రిని తన వద్ద నుంచి అనాధ ఆశ్రమం లో ఉంచారు..

ఆశ్రమం లోకూడా కొన్ని నెలల తరువాత వారికీ పంపించేటువంటి రుసుము పంపియక పోవటం వలన కొద్దీ రోజుల క్రితం ఆశ్రమం
నిర్వాహకులు ..రామయ్య ను దమ్మాయిగూడెం లో గల రోడ్ పక్కన ఉన్న రామాలయం వద్ద నిర్దాక్షిణ్యం గా వదిలి వెళ్లారు,..

దీంతో స్థానికులు..రామయ్య బిడ్డ రేణుక కి విషయం చేరవేసిన కూడా స్పందించలేదని..

చలికి వణుకుతూ టెంపుల్ పక్కన షెడ్ లో తలదాచుకోవడం తో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు
ఆశ్రమ సిబ్బంది వదిలి వెళ్లిన దగ్గర నుండి ఆ గ్రామంలో చుట్టూ పక్కన వారు ఈసంఘటన చూసి చలించి బోజనము సదుపాయాలు సమకూర్చు తున్నారు..

అసలే ముసలి ప్రాయంలో ఉన్న రామయ్య కి సేవా చేయాల్సిన బిడ్డ ఆస్తిని కైవసం చేసుకొని తండ్రిని అనాధగా రోడ్డుపై వేసిన రేణుకా పై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు..

తింటానికి తిండి లేక, తాగడానికి గుక్కెడు నీరు ఇచ్చేవారు లేరని అతను పడే కష్టాలు మరెవ్వరుకు రాకూడదని అధికారులు స్పందించి రామయ్య కు న్యాయం చేసి
ఆస్తిని అక్రమంగా పొందిన కూతురు రేణుక పై చర్యలు తీసుకోవాలని..

అనారోగ్యంతో ఉన్న రామయ్య కి మెరుగైన వైద్యం అందించాలని..గ్రామస్థులు..కోరుతున్నారు..