విలేకరిని బెదిరించిన వ్యక్తిపై చర్యలేవి…?

నిందితుని పిలిపించలేకపోతున్న పోలీసులు
ముదిగొండ ఫిబ్రవరి 4(నిజం న్యూస్):-
మండల కేంద్రం ముదిగొండలోని పారిశ్రామిక ప్రాంతంలో ఓ వ్యాపారవేత గుట్టను ఆక్రమించి అక్రమంగా గుట్టను తవ్వుతూ యదేచ్చగా కంకర ఆడుతూ ఎలాంటి అనుమతులు లేకుండానే జాతీయ రహదారు పనులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నాడు. సమాచారంతో ఈ విషయంపై సమగ్ర సమాచారంతో దిశా పత్రికలో అక్రమంగా మట్టి తవ్వకాలు అనే శీర్షికతో జనవరి 17 న వార్త ప్రచురితమైన విషయం విదితమే, మూడు రోజుల తరువాత మరింత సమగ్ర విచారణ కోసం దిశా విలేఖరి క్షేత్ర స్తాయికి వెళ్లగా విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ విషయం తెలుసుకున్న సదరు బడా కాంట్రాక్టర్ దిశా విలేఖరికి ఫోన్ చేసి నా మీద వార్త రాయడమే కాకుండా ఎంత ధైర్యం ఉంటే మరల నా భూమిలోకి వస్తావ్ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినకుండా నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై ముదిగొండ పోలీస్ స్టేషన్లో జనవరి 26న కాల్ రికార్డు తో సహా ముదిగొండ ఎస్హెచ్ఓ కి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పుడు అడిగిన ఈరోజు పిలిపిస్తా అనడం తెల్లారి అడిగితే నిన్న రాలేదు ఈరోజు పిలిపిస్తా అంటూ దాటువేత సమాధానాలు చెబుతూ ఇంతవరకు ఏటువంటి చర్యలు తీసుకోలేదు. పక్క ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఎస్ఐ ఎందుకు స్పందించడం లేదు. నేను నీతోని పిలిపించి మాట్లాడితే ఏంటి నేరుగా ఎఫ్ఐఆర్ చేయకుండా సదరు వ్యక్తి బడా కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకులకు సన్నిహితంగా ఉండడం వల్లనే చర్యలు తీసుకోవడం లేదా…