బొక్కల కంపెనీని మూసివేయాలని 2వ రోజు కొనసాగుతున్న నిరాహారదీక్ష

*దీక్షకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్ (మామ)
*-యాచారం మండల సిపిఎం పార్టీ కార్యదర్శి ఆలంపల్లి నరసింహ*
*-వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య*
యాచారం ఫిబ్రవరి 3 (నిజం న్యూస్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం, కొత్తపల్లి గ్రామ శివార్లలో వెంకటేశ్వర గుడి ప్రక్కన, రైతుల పంట పొలాల మధ్యలో ఉన్న కిసాన్ ఆగ్రో ఫిడ్స్ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతుండడం తో వెంటనే ఆ కంపెనీని మూసివేయాలని కొత్తపల్లి గ్రామ ప్రజలు నిన్న 02.02.2023న కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారు మరియు ఈసీ శేకర్ గౌడ్ మామ గారు ఈరోజు దీక్షలో పాల్గొని, వెంటనే కంపెనీని మూసివేయాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది, కంపెనీ మూసివేసే వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామస్థులకు అండగా ఉంటుంది అని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి గారు మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా పశువుల యొక్క వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచి వాటితో కల్తీ వంట నూనె, డాల్డా, నెయ్యి వంటివి ఈ కంపెనీలో చేస్తున్నారు, ఈ పశువుల వ్యర్థ పదార్థాలు నిల్వ ఉంచడం వలన చుట్టుప్రక్కల గ్రామాలలో భరించలేని దుర్గంధం వాసన రావడము వలన చుట్టూ ప్రక్కల గ్రామాలు కొత్తపల్లి తక్కల్లపల్లి, తమ్మాలోని గూడ, కిషన్ పల్లి, తండాలు, లోని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు, అదేవిధంగా ఇక్కడ తయారు చేసిన ఈ కల్తీ నూనెను హైదరాబాద్ వంటి నగరాలకు పంపిస్తూ అక్కడి ప్రజల ఆరోగ్యాలకు కూడా హాని కలిగిస్తున్నారు, వెంటనే దీనిపై కఠిన చర్యలు చేపట్టిలని, ఈ కంపెనీని మూసివేయాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు, ఈ కంపెనీ మూసివేసే వరకు గ్రామస్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని దండెం రాంరెడ్డి గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తక్కల్లపల్లి సర్పంచ్ కంబాలపల్లి సంతోష కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కావలి జగన్ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్ స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల్ ప్రెసిడెంట్ దెంది రాంరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పండల రమేష్ గారు, దెంది రవీందర్ రెడ్డి గారు, కృష్ణ, యూత్ కాంగ్రెస్ దేసారం జగన్ మోహన్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పుల శేకర్ యాదవ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు కంబాలపల్లి జంగయ్య, బండ అయిలయ్య ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు విప్లవ కుమార్ దెంది రవీందర్ రెడ్డి పెద్దాపురం నరసింహ తల్లారి సత్యం, చందర్ నాయక్ సోమరాజు శ్రీకాంత్, రాజేందర్ రెడ్డి, తాలంపల్లి నర్సింహా, కావలి బాలయ్య, ఎండీ.రని, అలుగువెల్లి శ్రీనివాస్ రెడ్డి ఈగ మధుసూదన్ రెడ్డి నాగిళ్ళ వెంకటయ్య, తలారి యాదయ్య కొండాపురం నరసింహ గుడ్ల జంగయ్య తలారి పోశయ్య మాలే నారాయణరెడ్డి బండ వెంకటేష్ మరెడుపెల్లి నరేందర్ రెడ్డి, రాంబాబు, శ్రీకాంత్ మరియు గ్రామస్థులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున యువజన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.