సినీ కళా దిగ్గజం దివికేగింది

*కళా రవళి అధ్యక్షులు ..నీలి నందు
చర్ల, ఫిబ్రవరి 3 (నిజం న్యూస్) సినీ కళా దిగ్గజం .కళాతపస్వి. బాబా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. కే విశ్వనాథ్ మృతి సినీ కళా రంగానికి తీరని లోటని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా కె విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు అనంతరం కళా రవళి అధ్యక్ష కార్యదర్శులు నీలి నందు విశ్వనాధ్ 60 సిత్రాలకు పైనే దర్శకత్వం వహించారని ఎక్కువ శాతం సాంప్రదాయ కలలకు పెద్దపీఠ వేశారని అన్నారు సాంప్రదాయ సంగీత కలలను పోషించారని కొనియాడారు శాస్త్రీయ సంగీతంకు జీవం పోశారని పేర్కొన్నారు ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం స్వాతి కిరణం స్వయంకృషి సిరిసిరిమువ్వ. స్వర్ణకమలం ఆపద్బాంధవుడు చిత్రాలకు దర్శకత్వం వహించారని అన్నారు సాంప్రదాయ చిత్రాలను నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళారవలి. గౌరవ అధ్యక్షులు చింతూరి వెంకట్రావు. ఉపాధ్యక్షులు ఎస్.డి అజీజ్. కళాకారులు గాదె సుధాకర్.చెన్న మహేష్ .ఎం దుర్గారావు. చిన్నారి భవ్య శ్రీ పాల్గొన్నారు