పినపాక నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

– చిరుమళ్ళ గ్రామంలోని సమ్మక్క-సారక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు
– ఆలయభివృద్ధికి రూ.లక్ష విరాళం
పినపాక ఫిబ్రవరి 2 (నిజం న్యూస్) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో జరుగుతున్న సమ్మక్క – సారక్క మినీ మేడారం జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కరించారు. ఆలయభివృద్ధి నిమిత్తం రూ. లక్షను కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. అనంతరం కరకగూడెం మండలంలోని సమత్ బటుపల్లి, పినపాక మండలం సీతంపేట, అశ్వాపురం మండలం మొండికుంట, ఆనందాపురం, బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు రెడ్డి పాలెం, సారపాక, బూర్గంపహాడ్, సోంపల్లి గ్రామాల్లోనూ పొంగులేటి పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాలను అందజేశారు. పలు శుభకార్యాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.