కారుకు రెడ్ సిగ్నల్ ?
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న 10 మంత్రులు, 20 ఎమ్మెల్యేలు
ప్రసుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సర్వేల హవా మొదలయ్యింది. ఇద్దరు ముఖ్యమంత్రులు దేశంలో పేరెన్నిక గల సర్వే ఏజన్సీలతో తమ ప్రభుత్వం ఇమేజి, ఎమ్మెల్యేల , మంత్రుల పని తీరు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో బలాబలాలు, తమ విజయావకాశాలపై సర్వే చేయించుకుంటున్నారు. ఎ పి ముఖ్యమంత్రి అయితే గత జులై లోనే సర్వే పూర్తి చేయించి దానికనుగుణంగా ఎమ్మెల్యాలకు 40 సాతంకూడా ప్రజాదరణ గ్రాఫ్ లేదని నిర్ధారించుకొని అందరికీ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే బాటలో ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కె సి ఆర్ కుడా పయనిస్తునట్లు సమాచారం.
కొన్ని నెలల కిందట మరోసారి సిట్టింగ్ లకే టికట్లు అని ప్రకటించిన కె సి ఆర్ ఇప్పుడు మాట మార్చారు.తాజాగా తన ఎమ్మెల్యేలపై చేయించిన సర్వే నివేదిక చూసి షాకయ్యారు.కారణం ఆయన మంత్రివర్గంలో వున్న పది మందికి తీవ్ర ప్రజా వ్యతిరేకత వున్నదని, వారు ఇసారి గెలవడం చాలా కష్టం అన్నది సదరు నివేదిక సారాంశం. దానితో వీరికి మరొకసారి అసెంబ్లీ టికట్ ఇవ్వడంపై ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఎవరికి టిక్కట్ అన్నదానిపై చర్చ జరుగుతొంది. సిట్టింగులకే టికట్లు అన్న కె సి ఆర్ ప్రకటనతో ఆశావహులెందరో నిరాశకు లోనయ్యారు. ఇంకొక పార్టీలోకి జంప్ చేసేందుకు పక్కా ప్లాన్ కూడా సిద్ధం చెసుకున్నారు. అయితే ఇటీవలి సర్వే సారాంశం పార్టీ వర్గాల్లో లీకయ్యింది. పది మంత్రులతో పాటు కనీసం మరొక 20 మంది ఎమ్మెల్యేల విజయం డౌటే అన్నట్లు తెలుస్తోంది. దానితో ఆశావహుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కొందరు మంత్రుల అనుచరులు, బంధువులు మంత్రి గారి పేరు చెప్పి ఆగడాలకు, అవినీతికి పాల్పడుతున్నట్లు, కొందరు మంత్రులను కలవాలంటే ఆయన కింద వున్న టీం ను సంతృప్తి పరిస్తే కాని పని జరగదని, ఇంకొక మంత్రి కేవలం ప్రారంభోత్సవ కార్యక్రమాలకే హాజరవుతుంటారని, అధిక శాతం మందికి తమ నియోజకవర్గ ప్రజలతో ఎటువంటి సత్సంబంధాలు లేవని, ఆయా నియోజకవర్గాలలో విపక్షాలు బలపడుతునట్లు నివేదిక హెచ్చరించినట్లు సారాంశం. పార్టీ కంటే ఎమ్మెల్యేలు, మంత్రులలోనే ప్రజలలో వ్యతిరేకత వుందన్నది నివేదికలోని మరిక ముఖ్యమైన అంశం. ఉత్తర తెలంగాణా కంతే దక్షిణ తెలంగాణాలోనే టి ఆర్ ఎస్ కు గడ్డు పరిస్థితులు వున్నాయని, విపక్ష బి జె పి సరిగ్గా అక్కడే బలపడుతోందన్న అంశంకూడా కె సి ఆర్ ను కలవరపరిచే మరొక అంశం. ఈ నివేదిక ద్వారా ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే ప్రమాదం అని కె సి ఆర్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.టి ఆర్ ఎస్ నుండి బి ఆర్ ఎస్ కింద రూపాంతరం చెందిన తరుణంలో పార్టీకి ప్రజలలో ఇమేజ్ పెంచాలని చూస్తున్న కె సి ఆర్ కు సదరు నివేదిక గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఎ పి సి ఎం తరహాలో తిరిగి నాలుగు నెలల సమయంలో రీ సర్వే చేయించి నిర్ణయం తీసుకుంటారా లేక ఈ సర్వే ఆధారంగా కొత్తవారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.