వజ్రోత్సవానికి ముస్తాబైన సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 2 (నిజం న్యూస్) కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల ధన్బాద్ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆ ప్రాంత ప్రజల యొక్క పిల్లలకు ఓ వరం.ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత సెయింట్ జోసెఫ్ పాఠశాలదే. జోసెఫ్ ఉన్నత పాఠశాల తొలుత 1963లో ప్రారంభమైన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతోంది.ప్రతి బడి దేశ ప్రగతికి నారుమడై వర్ధిల్లాలి అంటుంది సెయింట్ జోసప్.పాఠశాల ప్రగతి ప్రస్థానంలో ఎంతోమంది బ్రదర్ల చేత పాఠశాల అభివృద్ధి చెందుతూ, అత్యుత్తమమైన విద్యని నేర్చుకోవాలనే
ఆసక్తిని కలిగించేలా విద్యా ప్రణాళికలను అమలు చేస్తూ, నవతరానికి నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ,సాహితీ, సాంస్కృతిక, క్రీడా,విద్యా విషయాలలో తనదైన ముద్రను చాటుకుంది సెయింట్ జోసఫ్ పాఠశాల.ఈ లౌకిక ప్రపంచంలో ఎంతో మందిని అభివృద్ధి పథంలో నడిపించి, విజయశిఖరాలు అధిరోహించేలా వారందరిని ప్రోత్సహిస్తూ వారి హృదయాకాశంలో నిత్యం వెలుగొందుతుంది సెయింట్ జోసఫ్ పాఠశాల.సమకాలీన పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కావల్సిన నైపుణ్యాలను వారికి అందిస్తూ, వారి మస్తిష్కాలకు మెరుగులు దిద్దేలా విద్యార్థుల సర్వతోముఖాభివృధికి సానపెట్టుగా మారి, భవిష్యత్తుతరానికి
విజ్ఞానవంతులైన యువ తరంగాన్ని,సమాజానికి ఉన్నత వ్యక్తులను అందిస్తున్నది ‘సెయింట్ జోసఫ్. ప్రారంభంలో 130మంది విద్యార్థులతో మొదలుపెట్టి ప్రస్తుతం 1,300 మంది బాలబాలికలకు విద్యనందిస్తోంది.ఈనెల శని, ఆదివారాల్లో వజోత్సవాల నిర్వహణకు వేదికవుతోంది, విద్యాబుద్ధులు నేర్చి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన పాఠశాల నీడలో గడపడానికి సుమారు 2వేల మంది పూర్వ విద్యార్థులు పండగ వాతావరణం నెలకొల్పటానికి సిద్ధమవుతున్న పాఠశాల,ఈ వజోత్సవ సంబరాల్లో భాగంగా ఫిబ్రవరి 4వ తేదిన పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం జరగనుంది ఫిబ్రవరి 5వ తేదిన పాఠశాల వజోత్సవ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోనుంది.