ప్రతి కెమిస్ట్ కస్టమర్ పట్ల మర్యాదపూర్వకంగా వుండాలి – డ్రగ్స్ ఇన్స్పెక్టర్

ప్రతి కెమిస్ట్ కస్టమర్ పట్ల మర్యాదపూర్వకంగా వుండాలి – డ్రగ్స్ ఇన్స్పెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 2 (నిజం న్యూస్)
కొత్తగూడెం కెమిస్ట్ భవన్ లో జరిగిన ఆత్మీయ పరిచయ సమావేశానికి
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కెమిస్ట్ లకు పలు విషయాల పై అవగాహన కల్పించారు.హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అమ్మెటప్పుడు తప్పనిసరిగా ప్రెస్క్రిప్షన్ కాపీ ఒకటి ఫైల్ చేయాలని, డైక్లో 30 ఎoఎల్ పారా 30ఎంఎల్ మొదలైన వైల్స్ అసలు అమ్మవద్దని,ఆర్ఎంపి లకు అమ్మే రిటైల్ మరియు హోల్ సెల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిసాధ్యమైనంత వరకు సొంత క్యూపి లను లేదా దగ్గరలో వుండే క్యూపి లను ఏర్పాటు చేసికోవాలని
హెచ్ ,హెచ్ వన్ రిజిస్టర్ లు మరియు బిల్లులు తప్పనిసరిగా రాయాలని,వెటర్నరీ మందులు అమ్మేవారు తప్పనిసరిగా రిటైల్ షాప్స్ ద్వారా మాత్రమే అమ్మాలని,పల్లెటూరు లోని రైతు లకు డైరెక్టుగా చేయకూడదని చెప్పారు. గడువు ముగిసిన మందులను తప్పనిసరిగా విడిగా రాసి ఉంచాలని మిగతా మందులతో కలిపి ఉంచుకోవడం నేరమని చెప్పారు.రీటైలర్ సిస్టమ్ ద్వారా బిల్స్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా సెకండ్ కాపీ ఫైల్ చేయాలని సూచించారు
సాధ్యమైనంత మేర తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ల వద్దనే మందులు కొనాలని సూచించారు.డిస్ట్రిబ్యూటర్ లు బిల్స్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా బ్యాచ్ నెంబర్ లు కరెక్ట్ గా ఉండాలని చెప్పారు.
కెమిస్ట్ లు అందరూ సకాలంలో లైసెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ ప్రింట్ చేయించిన నూతన సంవత్సర కాలండర్ ని డి ఐ ఆవిష్కరించారు.