Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చాకలి ఐలమ్మ శిలాఫలకాని ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

తుంగతుర్తి ఫిబ్రవరి 2 నిజం న్యూస్

మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ప్రతిష్టించిన వీరనారి చాకలి ఐలమ్మ శిలాఫలకాని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గురువారం బాపూజీ రజక సంఘం గ్రామ అధ్యక్షులు ఐతరాజు అంజయ్య, కార్యదర్శి బోనగిరి లక్ష్మీనారాయణ లు డిమాండ్ చేశారు.11 కాలముగా గ్రామములో విగ్రహం ప్రతి స్థాపించినప్పటికీ కావాలని కొంతమంది దుర్మార్గులు శిలాఫలకాని ధ్వంసం చేయడం అవివేకం అని అన్నారు జరిగిన సంఘటనపై తుంగతుర్తి పోలీసులు విచారణ జరిపి తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో రజకులంతా ఐక్యం కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు…