కొడకంచి గ్రామంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహోత్సవం

జిన్నారం ఫిబ్రవరి 1 (నిజం న్యూస్)
దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్
జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహోత్సవంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ, పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జైపాల్, ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ క్రిష్ణ, రాజు గౌడ్, వార్డ్ సభ్యులు మల్లేష్, హరిశంకర్, ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, నాయకులు, గ్రామ అధ్యక్షుడు నాగరాజు, లక్ష్మారెడ్డి, వీరేందర్, వెంకటేష్, సత్యనారాయణ, క్రిష్ణ, లింగం తదితరులు పాల్గొన్నారు