జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ గా శ్రీమతి యాస్మిన్ భాషా బాధ్యతల స్వీకరణ

జగిత్యాల, ఫిబ్రవరి 1 నిజం న్యూస్
జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ గా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి యాస్మిన్ భాష సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న శ్రీమతి యాస్మిన్ భాష ను జగిత్యాల జిల్లా కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వనపర్తి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే నాగర్ కర్నూలు కలెక్టర్గా శ్రీమతి యాస్మిన్ భాష అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే శ్రీమతి యాస్మిన్ భాషా గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ కీలకంగా వ్యవహరించారు. రాజీవ్ విద్యా మిషన్ పిఓ గా, నారాయణ పేట రెవెన్యూ డివిజన్ అధికారి గానూ పని చేశారు