శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామివారి సేవలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీసీపీ

యాదగిరిగుట్ట ,జనవరి 31( నిజం న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిసిపి రాజేష్ చంద్ర లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు
ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు .వేద ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. డిఇఓ దోర్భల భాస్కర శర్మ, ఏసిపి కోట్ల నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.